నవతెలంగాణ – అచ్చంపేట
రాష్ట్రంలో నిర్వహించిన బీసీ కులగనున సర్వే రిపోర్ట్ పూర్తిగా బూటకపు సర్వేగా అభివర్ణిస్తూనామని బీసీ కులాల ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఎంఎం గౌడ్ అన్నారు. బుధవారం అచ్చంపేటలో బిఎల్పి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం చేపట్టిన సమగ్ర సర్వేలో 2014లో 51 శాతం గా ఉన్న బీసీల సంఖ్యను ప్రస్తుత ప్రభుత్వం విడుదల చేసిన సర్వేలు 46 శాతానికి కుదించటం పట్ల దుర్మార్గమైన చర్యగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అగ్రకులాల సంఖ్యను రెట్టింపు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీల, సంఖ్యను గణనీయంగా తగ్గించి చూపడం హేయమైన చర్య అన్నారు. తెలంగాణలో సమగ్రంగా చేయని సర్వే, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సర్వే చేస్తా అంటే నమ్మడం ఎలా అని ప్రశ్నించారు. మొత్తం బీసీల సంఖ్య గత పది సంవత్సరాల నుండి పెరగాలి కానీ తగ్గుతుందా ఈ సంఖ్యను తగ్గించి రిజర్వేషన్లు కుదించి ఆగ్రకులాల సంఖ్య ఎక్కువగా చూయించి రిజర్వేషన్లను బీసీలకు రాకుండా చేసే కుట్ర దాగుందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు ముఖ్యంగా హైదరాబాదులో సర్వే చేయలేదన్నారు. ఇది ప్రజా పాలన కాదని, రెడ్డి పాలనని ,అగ్ర కులపాలన అని మొత్తం రెడ్లతో అసెంబ్లీ శాసనమండలి నిండిపోయిందని, బీసీలకు స్థానం లేదని విమర్శించారు. ప్రభుత్వ విడుదల చేసిన సర్వే రిపోర్టు కాపీలతో రాష్ట్ర వ్యాప్తంగా బిసి కులాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో తగలబెడతామని, తక్షణమే తిరిగి హైదరాబాద్ తో సహా రీసర్వ్ చేయాలని ఆ తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎలిమినేటి శ్రీశైలం, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీ పంబలి బాలసుబ్రమణ్యం, నాగయ్య, శ్రీరామ్ తదితరులు ఉన్నారు.