
– బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు నల్లివెల్లి శంకర్
నవతెలంగాణ- మల్హర్ రావు: పార్టీలకతీతంగా బహుజనులు అందరూ ఏకమై మంథనిలో బీసీ బిడ్డ పుట్ట మధూకర్‌ను ఎమ్మెల్యేగా గెలిపించాలని బహుజన సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసు కె యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లివెల్లి శంకర్ కోరారు. శనివారం మండలంలోని బీసీ సంఘం నాయకులతో కలిసి కొయ్యూరు ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వాసు కె యాదవ్, నల్లవెల్లి శంకర్ మాట్లాడుతూ.. మంథని నియోజకవర్గంలో 95 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బహుజన వర్గాల ప్రజలు ఉన్నప్పటికీ రాజ్యాధికారం మాత్రం (మంథని ఎమ్మెల్యే పదవి) అనేక ఏండ్లుగా అగ్రవర్ణాలు చేతుల్లోనే ఉందన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యే గా బీసీలకు అవకాశం రావడమే అరుదుగా ఉన్న ప్రస్తుత తరుణంలో ముఖ్యమంత్రి కెసిఆర్ మంథనిలో బీసీ బిడ్డ పుట్ట మధుకు మరోసారి మంథని ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారని వారు గుర్తు చేశారు. మంథని నియోజకవర్గంలో 95 శాతం ఉన్న బహుజనులు ఏకమై ఈ ఎన్నికల్లో బీసీ బిడ్డ పుట్ట మధూకర్ ను మంథని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ ఇందారపు మల్లయ్య, బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఇజ్జగిరి సాకేత్, జాతీయ బీసీ సంఘం ఇన్చార్జ్ విజయగిరి సమ్మయ్య, మల్హర్ మండల్ బీసీ సంఘం సీనియర్ నాయకులు అనిపెద్ది రాంబాబు చారి చంద్రమౌళి గౌడ్, కేశవ్ చారి తిరుపతి, విజయగిరి రాజు, కోడారి బాపు బ్రహ్మచారి, పూసల రవి, మధు, వేల్పుల రవి, ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.