బీసీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి విద్యార్థులకు మెస్‌ చార్జీలు పెంచాలి

– మెనూ ప్రకారం భోజనం అందించాలి
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్‌ కుమార్‌ కందుకూరి
నవతెలంగాణ-తాండూరు
బీసీ ఆశలకు సొంత భవనాలను నిర్మించాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్‌ కుమార్‌ అన్నా రు. ఆదివారం బీసీ కాలేజ్‌ బార్సు హాస్టల్‌ని సందర్శించి అక్కడి సమస్యల్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తాండూర్‌ నియోజకవర్గ బీసీ సంఘం కన్వీనర్‌ రాజ్‌ కుమార్‌ కందుకూరి మెనూ ప్రకారం భోజనం అందుతుందా లేదా అనే విషయాన్ని అడిగి తెలు సుకున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మెస్‌చార్జిలు పెం చాలని అలాగే అద్దె భవనాల్లో ఉన్నటువంటి హాస్టల్లో కా కుండా సొంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని డి మాండ్‌ చేశారు. విద్యార్థులకు దుప్పట్లు అందించాలని తెలి పారు. విద్యార్థులకు ఎలాంటి సమస్య ఉన్నా తమకు తెలు పాలని సూచించారు. కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్‌ శుకుర్‌, జిల్లా నాయకులు గడ్డం వెంక టేష్‌, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, సోషల్‌ మీడియా కన్వీనర్‌ బసు, బీసీ యువ నాయకులు టైలర్‌ రమేష్‌, నర్సింహులు, మతిన్‌, జుంటుపల్లి వెంకట్‌, సాయి, నగేష్‌, హాస్టల్‌ వార్డెన్‌ సంగమేష్‌ విద్యార్థులు పాల్గొన్నారు.