మాదిగోళ్ళు గుడిలోకి వెళ్ళోద్దని అడ్డున్న బీసీ కూలాలు

BC Koolas are preventing Madigolu from entering the temple– ఆలస్యంగా వెలుగులోకి..
– గ్రామాన్ని సందర్శించిన సీఐ, ఎస్ఐ
– తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులకు మొర
నవతెలంగాణ – మర్కుక్
ఆధునిక యుగంలోనూ అంటరానితనం ఏదో ఒక రూపంలో కనిపిస్తుంది. దళితులపై వేధింపులు నేటికి కొనసాగుతున్నాయి. జిల్లాలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. దళితులకు ఆలయంలో ప్రవేశం లేదని, బీసీ‌ కులస్తులు అడ్డుకున్నారని బాధితులు చెప్పారు. మర్కుక్ మండల పరిధిలోని శివారు వెంకటాపూర్ గ్రామంలోని దుర్గమ్మకు, గ్రామ దేవతలకు బోనాలు సమర్పించేందుకు దళితులు ఆలయానికి వచ్చరు. అయితే వారిని ఆలయంలోకి వెళ్లనివ్వకుండా బీసీ కులస్తులు అడ్డుకున్నారు. మీరు మాదిగోళ్ళు గుడిలోకి వెళ్ళోద్దని అడ్డున్నరని దళితులు ఆరోపించారు.
అసలేం జరిగింది?
కాలం మారుతోంది, అభివృద్దిలో దేశం ముందుకు సాగుతోంది. అయినా దళితుల పట్ల వివక్ష కొనసాగుతుంది. ఇప్పటికీ కొన్ని చోట్ల దళితుల ఆలయ ప్రవేశాలను అడ్డుకుంటున్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఉల్లంఘిస్తూ వివక్ష చూపిస్తున్నారు. శివారు వెంకటపూర్ గ్రామంలోని దుర్గమ్మ గుడిని నూతనంగా నిర్మించారు. ఈ సందర్భంగా శనివారం గ్రామంలోని మాదిగ కులస్తులు దుర్గమ్మకు బోనాలు తీసే క్రమంలో బీసీలు కొంతమంది మీరు మాదిగోళ్ళు దుర్గమ్మ బోనాలు తీయోద్దని  , దుర్గమ్మ గుళ్ళోకి మాదిగోళ్ళకు  ప్రవేశం లేదని ఆలయానికి అడ్డుకున్నారు. దీంతో మాదిగలు మర్కుక్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశారు.
గ్రామాన్ని సందర్శించిన సీఐ,ఎస్ఐ
గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి, మర్కుక్ ఎస్ఐ దామోదర్ లు సోమవారం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజలు సమన్వయంతో ఉండాలని, కౌన్సిలింగ్ నిర్వహించారు. గ్రామ దేవతలకు కూలాలతో సంబంధం లేకుండా అన్ని కూలాల వారు బోనాలు తీయొచ్చని ,ఎవరైన అడ్డుకుంటే శాఖ పరమైన చర్యలు తప్పవన్నారు. గ్రామంలో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే సాహిచేంది లేదని,అంటారనితనం పాటిస్తే కఠిన  చర్యలు తప్పని హెచ్చరించారు. గ్రామంలో ఇలాంటి గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పి, శాంతియుతంగా ఉండాలన్నారు.గ్రామంలో అన్ని కులాల వారు అన్నదమ్ముల వలే కలసి మెలసి ఉండాలని సూచించారు. గ్రామస్థులకు మంగళవారం  మరోసారి కౌన్సిలింగ్ నిర్వహిస్తాని తెలిపారు.తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను వేడుకున్నారు.