నవతెలంగాణ- కంటేశ్వర్
బిసి జాతీయ మహాసభ కొరకు తిరుపతి నిజామాబాద్ బీసీ నాయకులు బయలుదేరారు. సోమవారం (07/08/23) తిరుపతిలో జరుగు బీసీ జాతీయ సభలో పాల్గొనడానికి బయల్దేరిన నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు. ఈ సందర్భంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ మాట్లడినారు. జనాభాలో 60% ఉన్న బీసీలకు ప్రతి దాంట్లో అన్యాయం జరుగుతుందని అన్నారు. పోరాడితేనే బీసీలు తమ హక్కులను సాధించుకోగల్గుతారు అని అన్నారు. బీసీలు రాజ్యాధికారం సాధించాలంటే తమ సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైంది అని అన్నారు. 60% బీసీలు ఏకమైతే 100% రాజ్యం సొంతమైతదన్నారు. తిరుపతికి పోయిన వారిలో నరాల సుధాకర్, మాడవేడి వినోద్ కుమార్, ధర్శనం దేవేందర్, కరిపె రవిందర్, కొయ్యాడ శంకర్, శ్రీలత, లక్ష్మీనారాయణ, శేఖర్, ప్రశాంత్, విజయ్, మహేష్, సంజీవ్ తదితరులు ఉన్నారు.