నవతెలంగాణ-పరిగి
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య పరిగికి చెందిన హనుమంతు ముదిరాజ్‌ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శిగా నియమించారు. ఈ సంద ర్భంగా మంగళవారం పరిగి పట్టణ కేంద్రంలోని హనుమంతు ముదిరాజ్ నివాసంలో ఆయనను బీసీ నాయకులు ఘనంగా సన్మానించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి కే హనుమంతు ముదిరా జ్ మాట్లాడుతూ..తనకు ఇచ్చిన పదవికి బాధ్యతతో తగిన విధంగా న్యాయం చేస్తానన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీలను రాజకీయంగా ఎదగకుం డా చట్టసభలలో అగ్రకులాల వారు రిజర్వేషన్ లేకుం డా అడ్డుకుంటున్నారని, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు చట్టసభలలో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ ఉన్నది కానీ బీసీలకు రిజర్వేషన్ లేకుంటే బీసీలు ఎలా ఎదుగుతారన్నారు. బీసీలకు ఎలా న్యా యం జరుగుతుందని అందువలన చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ వచ్చేంతవరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా బీసీ బిల్లు పార్లమెంటులో పెట్టే విధం గా పోరాటం చేస్తామని, దాని గురించి ఆర్.కృష్ణ అన్న తన జీవితాన్ని త్యాగం చేస్తూ ఎనలేని పోరాటం చేస్తు న్నారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ నడుంబిగించి ఆర్.కృష్ణ అన్నకి మద్దతు పలికి బీసీ బిల్లును సాధిం చుకోవాలని దీనికి దేశంలోని బీసీలందరూ కలిసి రావాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమం సంఘం రాష్ట్ర కన్వీనర్ లాల్ కృష్ణ ప్రసాద్, పరిగి నియోజకవర్గం ముదిరాజ్ అధ్యక్షు రామస్వామి ముది రాజ్, ఉపాధ్యక్షులు బుచ్చన్న, ముఖ్య సలహాదారులు రామకృష్ణ దనేశ్వర్, బీసీ నాయకులు చిన్న నరసిం హులు, ఆనెం ఆంజనేయులు, ఎక్స్ సర్వీస్మెన్ లింగ మయ్య, జాఫర్ పల్లి పీడి కాటంపల్లి హనుమంతు, కురుమల వెంకటేష్, బాలు మెకానిక్, పీడీలు వెం కట్, శ్రీనివాస్, రాజు, శ్రీధర్, చందర్, తదితరులు పాల్గొన్నారు.