
మండల్ జయంతి సందర్బంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 7న నిర్వహించే జాతీయ మహాసభలను ఈ ఏడాది పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ లో చాలా పెద్దగా నిర్వహించారు. ఈ జాతీయ మహాసభలో పాల్గొనడానికి నిజామాబాద్ జిల్లా నుండి పెద్ద ఎత్తున బీసీ నాయకులు పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై గళం విప్పాల్సిన ఇదే సరైనా సమయం అన్నారు. ఇప్పుడు మన హక్కుల కొరకు పారాడక పోతే రాబోవు తరాలకు మనం అన్యాయం చేసిన వారిమవుతామన్నారు. కులగణన వెంటనే చేపట్టాలని డిమాండ్ చేసారు. 9వ జాతీయ ఓబీసీ మహాసభలో పాల్గొనడం అదృష్టమని జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్, ఆకుల ప్రసాద్, కరిపె రవిందర్, మాడవేడి వినోద్, కొయ్యాడ శంకర్, శ్రీలత, రవి, బసవరాజు, విజయ్, పవార్, మహేష్, దామోదర్, సతీష్, నిరంజన్, విశాల్ తదితరులు పాల్గొన్నారు.