బీసీ ఉద్యమాలకు కవిత పెత్తనం అవసరం లేదు


*మూడు దశాబ్దాల బీసీ ఉద్యమ చరిత్ర మా బీసీ సంఘానిదే
*బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు
నవతెలంగాణ సిరిసిల్ల
బీసీల 42 శాతం రిజర్వేషన్లపై అపోహలను తొలగించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిధేనని , ఎమ్మెల్సీ కవిత నాయకత్వం బీసీలకు అక్కరలేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు డిమాండ్ చేశారు, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీసీ భవన్ లో జిల్లా అధ్యక్షుడు వీరబోయిన మల్లేష్ యాదవ్ అధ్యక్షతన బుధవారం జరిగిన జిల్లా స్థాయి బీసీల సమావేశానికి ముఖ్యఅతిథిగా పర్శ హన్మాండ్లు విచ్చేశారు, ఈ సందర్భంగా ముందుగా బీసీ శ్రేణులకు, ప్రజలకు పర్శ హన్మాండ్లు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు, అనంతరం పర్శ హన్మాండ్లు మాట్లాడుతూ పోయిన  అసెంబ్లీ ఎన్నికల అప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పేరిట కామారెడ్డిలో 42 శాతం రిజర్వేషన్లను బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొందన్నారు ,అందుకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన చేసిందని దాన్ని అమలు చేయవలసింది ఇక మిగిలి ఉన్నదని పర్శ హన్మాండ్లు అన్నారు, కులగణన లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారనీ కానీ కొందరు కాంగ్రెస్ మంత్రులు పాల్గొనలేదని  అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డిలు కూడా కులగణనలో పాల్గొనలేదని మాకు సమాచారం ఉన్నదని ఇలా చేయడము శోచనీయమనీ పర్శ హన్మాండ్లు అన్నారు.
కుల గణనలో పాల్గొనని వాళ్లు ఆత్మ విమర్శ చేసుకోవాలని సందర్భంగా హన్మాండ్లు పిలుపునిచ్చారు,  దేశవ్యాప్త జనగణన సెన్సెస్ లో భాగంగా కులగణన కూడా చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏ ఐ సి సీ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టి ఆ పార్టీలో ఆమోదింప చేసినారని అందుకు మా సంఘం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నామనీ హన్మాండ్లు అన్నారు. కుల గణన లో భాగంగా బీసీల రిజర్వేషన్ 42శాతాన్ని ఈ తెలంగాణలో అమలు  చేసి చూపిస్తే సంతోషమన్నారు, మాటలకే పరిమితమైతే ఎత్తిచూపుతామన్నారు సిరిసిల్ల పట్టణంలో 39 వార్డుల కార్యవర్గం , జిల్లాలోని 13 మండలాల కార్యవర్గాలు ఏర్పాటు చేయాలని సమావేశంలో తీర్మానించినట్లు పర్శ హన్మాండ్లు పేర్కొన్నారు, సంఘం బలోపేతంలో భాగంగా జిల్లా కమిటీ సలహాదారుడిగా తోట్ల రాములు యాదవ్, సిరిసిల్ల పట్టణ ఉపాధ్యక్షుడిగా బచ్చు ప్రసాద్ లను నియమించినట్లు పర్శ హన్మాండ్లు పేర్కొన్నారు, ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు తడ్క కమలాకర్, నాయకులు నల్ల శ్రీకాంత్, కొండా విజయ్,  బోయిని శ్రీనివాస్, తడక శశికుమార్,శ్రీధర్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.