బిసి సంక్షేమ సంఘం కలెక్టరేట్ ధర్నా 

నవతెలంగాణ కంఠేశ్వర్

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు నిజాంబాద్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు నవాతే ప్రతాప్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా శనివారంం నిర్వహించారు. ఈ సందర్భంగా నవతే ప్రతాప్ మాట్లాడుతూ.. ఎస్సీ ఎస్టీ బీసీ పెండింగ్ లో ఉన్న 5000 కోట్లు స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా మెసేచార్జీలు పెంచాలి. బిసి స్టడీ సర్కిల్ బడ్జెట్ను 200 కోట్లకు పెంచాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలి. !బీసీ బందును ప్రవేశపెట్టాలి బీసీ కులాలకు ఇచ్చే లక్ష రూపాయల పథకాన్ని అన్ని కులాలకు వర్తింపజేసేలా జీవో జారీ చేయాలి లేని పక్షాన ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సి అవసరం వస్తుంది. ఈ కార్యక్రమంలో గంగోలి రమేష్, వెంకట్ యాదవ్, నరేష్, శ్రీకాంత్, శివ కేశవ్, మహిళా అధికార ప్రతినిధి సరిత, చింటూ ప్రసాద్, విశాల్, తదితరులు పాల్గొన్నారు.