తపస్విలో బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుని పుట్టినరోజు వేడుకలు

నవతెలంగాణ- ఆర్మూర్
పట్టణంలోని మామిడిపల్లి తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ పాఠశాలలో గురువారం బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు అబ్బ గోని అశోక్ గౌడ్ జన్మదిన సందర్భంగా పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పిల్లల మధ్యలో కేక్ కట్ చేసి తన యొక్క జన్మదిన వేడుకలను చిన్నపిల్లల మధ్యలో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూతెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వ్యవస్థాపకులు మేఘపోతుల నరేందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇంకా ఇలాంటి ఎన్నో సేవ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అదేవిధంగా ఆర్మూర్ మండల కేంద్రంలో తపస్వి స్కూల్లో చదివే పిల్లలు వారికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ బిసి సంక్షేమ సంఘం బాల్కొండ నియోజకవర్గ అధ్యక్షులు దాసరి మూర్తి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆర్మూరు మండల అధ్యక్షులు గోజుర్ మహిపాల్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మండల ఉపాధ్యక్షులు సాయిలు , మెండోరా ప్రదీప్ నరేష్,జోయల్, జరూష, తపస్వి స్వచ్ఛంద సేవ సంస్థ యాజమాన్యం ఉపాధ్యాయులు,బీసీ నాయకులుతదితరులు పాల్గొన్నారు.