పార్లమెంట్ ఎన్నికల బరిలో బీసీ మహిళ..

నవతెలంగాణ – ఆర్మూర్
జిల్లా పార్లమెంట్ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు ముగ్గురు అభ్యర్థులను ప్రకటించగా, ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారుగా, ఒకరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జగిత్యాల ప్రాంత ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కాగా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన బీసీ మహిళ రాష్ట్ర నాయకురాలు పోటీలో నిలబడునున్నట్లు తెలిసింది. ఇప్పటికే మూడు నియోజకవర్గాల్లో ఆమె సుడిగాలి పర్యటన చేపట్టినట్లు తెలిసింది. గతంలో ఆమె ప్రధాన పార్టీలో పనిచేసి ప్రస్తుతం బహుజన పార్టీలో ప్రముఖ పాత్ర పోసి పోషిస్తూ, ఈపాటికి మహిళా కమిటీలతో సమన్వయం ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. గతంలో ఆమె పనిచేస్తున్న పార్టీలో ఆర్మూర్ శాసనసభ నుంచి పోటీ చేయాలని అభ్యర్థించినప్పటికీ ఆమె సుముఖంగా లేకపోవడంతో ఆస్థానంలో ఆర్మూర్ పట్టణానికి చెందిన ఒకరిని పోటీలోకి నిలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర నాయకత్వం ఆమె వైపు మొగ్గు చూస్తున్నప్పటికీ మారుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఆమె ప్రధాన పార్టీలో ఒక పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ, ఆమె బిసి సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర నాయకురాలు కావడంతో, ఈపాటికి అధిష్టానంతో చర్చలు జరిపి బీసీ కార్డుపై పోటీ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ తోపాటు మెట్పల్లి, కోరుట్ల నియోజకవర్గాల్లో ఉన్న బిసి సామాజిక వర్గాల నాయకులతో పాటు గతంలో పనిచేసిన బడుగు బలహీన వర్గాల నేతలతో చర్చించినట్లు తెలిసింది.  ప్రస్తుతం పని చేస్తున్న పార్టీలో ఆమెను మహిళ లీడర్ గా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తుండగా, ఒక సామాజిక వర్గం ఆమెకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. కాగా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాజకీయ చతురతతో కూడినటువంటి పార్టీలో ఆమెకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పినప్పటికీ, తాను ఇండిపెండెంట్ గా బరిలో నిలిచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపు పై ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. పార్లమెంటు ఎన్నికలు 40 రోజులకు ఉండటంతో సదర్ పార్టీ నాయకులు మూడు రోజులుగా ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఒకవైపు ఆమె సన్నిహితులు పార్టీ సింబల్ పై పోటీ చేస్తే కలిసొచ్చే అవకాశం ఉందని చెబుతుండగా, ఆ పార్టీ పార్లమెంట్ సెక్టార్లో అంతంత మాత్రమే కావడంతో ఆమె ఆ పార్టీ వైపు మొగ్గు చూపేందుకు సుముఖంగా లేనట్లు తెలిసింది. తనకు ఆరు నియోజకవర్గాల్లో ప్రజలతో ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకొని బీసీ కార్డు పై మహిళ నేతగా బరిలో నిలిస్తే గెలుపు నల్లేరుపై నడక ఉంటుందని ఆమె భావిస్తున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా ముగ్గురు మధ్యన మహిళా పోటీలో నిలవడం కలిసి వచ్చే అవకాశం కనబడుతుందని ఆమె సన్నిహితులు సోమవారం నవ తెలంగాణకు తెలిపారు.