బీసీ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

– బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సాప శివరాములు
నవతెలంగాణ-భిక్కనూర్
బీసీ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సాప శివరాములు అన్నారు. శనివారం మండల కేంద్రంలో బీసీ మహిళ ఎన్నుకున్నారు. భిక్నూర్‌ పట్టణ మహిళా అధ్యక్షురాలిగా నాగరాణి, ప్రధాన కార్యదర్శి భవిత, ఉపాధ్యక్షులు లలిత, గీత, పద్మ, సంగీత, సహాయ కార్యదర్శి పుష్ప, యమునా, హేమలత, అనసూయ, లక్ష్మి, వినీత లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నారాయణరావు, మండల అధ్యక్షులు నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.