బీసీకుల మహాధర్నా వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

– జనసభ ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా అధ్యక్షులు కొమ్ము శ్రీనివాస్‌ యాదవ్‌
నవతెలంగాణ-రంగారెడ్డి డెస్క్‌
జూన్‌ 15న ఇందిరాపార్కు దగ్గర తలపెట్టిన మహా ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బీసీ జనసభ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా అధ్యక్షులు కొమ్ము శ్రీని వాస్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు. తలకొండపల్లి మండల పరిధిలో శుక్రవారం కల్వకుర్తి పట్టణంలో ఉమ్మడి మహ బూనగర్‌ జిల్లా బీసీ జనసభ అధ్యక్షులు కొమ్ము శ్రీనివాస్‌ యాదవ్‌ అధ్యక్షతన జరిగిన మీటింగ్‌లో వివిధ బీసీ కుల, సంఘాలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. మహాధర్నా పోస్టర్‌ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడు తూ..కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ ప్రకా రం.కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే రాష్టంలో సమగ్ర కుల గణన నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. కులగణన నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలిచిన బీహార్‌ రాష్ట్రాన్ని మోడల్‌గా తీసుకొని, విధివిధానాల కోసం నిపుణుల కూ డిన కమిటీ వేయాలని ప్రభుత్వానికి సూచించారు. బీసీ సబ్‌ ప్లాన్‌ సాధన సమితి నాయకులు సదానందం గౌడ్‌ రాజేందర్‌ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట రేవంత్‌ రెడ్డి ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. కల్వకుర్తి మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మెన్‌ విజరు గౌడ్‌ మాట్లాడుతూ.. బీసీ కమిషన్‌ను అడ్డం పెట్టుకొని న్యాయపరమైన చిక్కుల్లోకి నెట్టి, బీసీల గొంతు కోసే కుట్ర జరుగుతోందని ఆరోపిం చారు. కల్వకుర్తి సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షులు జం గయ్య మాజీ సర్పంచ్‌ అంజి యాదవ్‌ మాట్లాడుతూ.. ఎదో వంకతోఎన్నికలకు వెళ్తే బీసీలు కాంగ్రెస్‌ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి తగిన బుద్ధి చెబుతారన్నారు. బీసీ సంఘం నాయకులు గంగాధర్‌ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కులగణన చేస్తామని పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ చెప్పినందుకే.కాంగ్రెస్‌ పార్టీకి 99 ఎంపీ సీట్లు దక్కిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల 15న ఇందిరాపార్కు దగ్గర బీసీ జనసభ తలపెట్టిన మహా ధర్నాకు వివిధ బీసీ కుల, సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. కార్యక్రమంలో ఉమ్మడి మహబూబు నగర్‌ జిల్లా అధ్యక్షులు కొ మ్ము శ్రీనివాస్‌ యాదవ్‌, బీసీ సబ్‌ప్లాన్‌ సాధన సమితి రాజేందర్‌, సదానందం గౌడ్‌, మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షులు జంగయ్య, మాజీ సర్పంచ్‌ అంజి యాదవ్‌, కల్వకుర్తి కౌన్సిలర్‌ నూనె శ్రీనివాస్‌ యాదవ్‌, పర్వతాలు యాదవ్‌, బీసీ సంఘం నాయకులు గంగాధర్‌ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.