మార్చి 1న బీసీసీఐ ఎస్‌జీఎం

– జాయింట్‌ సెక్రెటరీని ఎన్నుకోనున్న బోర్డు
ముంబయి : భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) రెండు నెలల వ్యవధిలో రెండోసారి సమావేశం కానుంది. సంయుక్త కార్యదర్శి పదవికి ఎన్నిక కోసం బీసీసీఐ ప్రత్యేక సర్వ సభ్య సమావేశం ఏర్పాటు చేసింది. ఎస్‌జీఎం నిర్వహణకు కనీసం 21 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాలి. జాయింట్‌ సెక్రెటరీ ఎన్నిక సింగిల్‌ ఎజెండాతో మార్చిన 1న ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఎస్‌జీఎం సమావేశం కానుంది. బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) అధ్యక్షుడు అవిషేక్‌ దాల్మియా, ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్స్‌ క్రికెట్‌ సంఘం (డీడీసీఏ) ప్రెసిడెంట్‌ రోహన్‌ జైట్లీ సహా ముంబయి క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) నుంచయి సంజరు నాయక్‌లు సంయుక్త కార్యదర్శి పదవి రేసులో ఉన్నారు.