బీసీలకు జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సోమవారం వెనుకబడిన తరగతుల స్థితిగతులు పరిశోధించడానికి నిర్వహించిన బహిరంగ విచారణ కార్యక్రమంలో లో ప్రమోద్ కుమార్ పాల్గొని మాట్లాడారు. సీ కులాలను జనాభా ప్రతిపాదకంగా రిజర్వేషన్లు ఉండాలని బహుజనులు కులాల వారిగా జనాభా ప్రతిపాదకంగా చట్టసభలలో స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పించాలని 1978లో ఎస్టి కుల జాబితాలో ఉన్న వంజరి కులస్తులను మళ్లీ ఎస్టి కుల జాబితాలోకి మార్చాలని కోరడం జరిగింది బిసి (డి) లో ఉన్న వంజరి కులాన్ని ఎంబిసి లో గుర్తించాలని కోరారు. పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు కోరినట్లుగా దేశ వ్యాప్తంగా కుల గణనను చేపట్టాలని చట్టసభలలో బహుజనులకు జనాభా ప్రతిపాదకంగా రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగనను బహుజనులు సంపన్న వర్గాల ప్రజలందరూ విజయవంతం చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పడిగెల ప్రదీప్ చౌటుప్పల్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఊదరి శ్రీనివాస్ పాల్గొన్నారు.