పాలకుర్తిలో బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలి

 – బీసీ సునామీ పార్టీ అభ్యర్థి చీకటి భూపాల్ గౌడ్
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్: బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలని బీసీ సునామీ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చీకటి భూపాల్ గౌడ్ అన్నారు గురువారం ఆయన మాట్లాడుతూ.. బీసీల ఐక్యతతో రాజ్యాధికారం చేపట్టే దిశగా బీసీల కోసం పార్టీని స్థాపించి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి తీసుకెళ్తానని అన్నారు. బీసీలను అధికారం ప్రతిపక్ష పార్టీలు ఓటర్లు గాని చూస్తున్నారని వారిని రాజకీయంగా అరగదొక్కుతున్నారని అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం లో గౌడ, గొల్ల కురుమలు, పద్మశాలీలు అత్యధికంగా ఉన్నారని బీసీలు బీసీ నాయకులు కోసం మన రాజ్యాధికారం కోసం మన ఓట్లను మనమే వేసుకొని గెలిపించుకోవాలని పాలకుర్తి నియోజకవర్గంలో, రాష్ట్రంలో దేశంలో 52 శాతం మంది బీసీలు ఉన్నారని మన బీసీ ఓట్లను మన ఓట్ల ద్వారా తీసుకున్నట్లయితే మనమే రాజ్యాధికారం చేపట్టొచ్చని బీసీలకు తెలిపారు. రాష్ట్రంలో దేశంలో బీసీలు అత్యధికంగా ఉన్నప్పటికీ రాజకీయంగా వెనుకబడి అగ్రవర్ణాల చేతిలో కీలుబొమ్మలుగా మారారని అన్నారు. ఓబీసీల ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యమనీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయని తెలిపారు. ప్రధాన పార్టీలు బీసీలను ఓటర్లుగానే చూస్తున్నాయనే తప్ప వారికి జనాభా దామాషా ప్రకారం ఎంపీ ఎమ్మెల్యే సీట్లు కేటాయించడం లేదన్నారు. జనాభాలో బీసీల వాటా అత్యధికమని, ఆ ప్రజల సహకారంతో గద్దెనెక్కిన ప్రభుత్వాలు వారి ఆకాంక్షలను నెరవేర్చడం లేదన్నారు. వెనుకబడిన తరగతులకు అధికారం, ఆత్మగౌరవం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కోసం అత్యంత వెనుకబడిన తరగతుల ప్రజల సునామీ పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. బీసీల రాజకీయ చైతన్యం కోసం నిరంతరం పోరాడుతానని అన్నారు. అగ్రవర్ణాల ఆధిపత్యం లో ఉన్న పార్టీలు బీసీలను అణగదొక్కుతున్నాయని దుయ్యబట్టారు.. బీసీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పార్టీలకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. రాజకీయాల్లో, సమాజంలో మార్పు కోసం ఓబీసీలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంజాల యాకేందర్, అశోక్, జంపయ్య, లింగాల నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.