
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
ఈనెల 15న హైదరాబాదులోని కాచిగూడ మున్నూరు కాపు భవన్ లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో చేపట్టే రాష్ట్ర మహాసభలకు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అన్ని వర్గాలు పెద్ద ఎత్తున తరలి రావాలని బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గం కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర సమావేశంలో బీసీల రిజర్వేషన్లు, కు ల గణన , బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చే పార్టీలకు మద్దతు, బీసీలకు జనాభా ప్రకారం ఎమ్మెల్యే టికెట్లు. విద్యా ఉపాధి ఉద్యోగ రంగాలలో తగిన నిధులు కేటాయించడం, బీసీలకు రాష్ట్రంలో దేశంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖలు, మహిళా బిల్లులో ఓబీసీలకు అవకాశం ఇంకా అనేక విషయాలను వివరిస్తారని పేర్కొన్నారు. బీసీలందరూ అధిక సంఖ్యలో పాల్గొని రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలని కోరారు.