నవతెలంగాణ వీర్నపల్లి: ఆటల తోపాటు చదువుల్లో ముందుండి మండలానికి మంచి పేరు తీసుక రావాలని ప్రజా ప్రతినిధులు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండల కేంద్రంలో సోమవారం సంక్రాత్రి పండుగ సందర్భంగా ఎంపిటిసి ఫోరం అధ్యక్షులు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో మండలంలోని 13 జట్లు పాల్గొన్నాయి. విన్నర్ గా వీర్నపల్లి జట్టు విజేతగా నిలిచింది. రన్నరప్ గా ఎర్రగడ్డ తండ జట్టు నిలిచింది విజేతలుగా నిలిచిన జట్లకు సర్పంచ్ పాటి దినకర్, ఎంపిటిసి ఫోరం అధ్యక్షులు మల్లారపు అరుణ్ కుమార్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముశం రమేష్, బంజార సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ నాయక్, అర్ ఎం పి రాజామౌళి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు క్రీడలతో మానసిక ఉల్లాసం, ఆరోగ్యం లభిస్తుందని, క్రీడలతో మంచి భవిష్యత్ ఉంటుందని అలాగే క్రీడలతో పాటు చదువుల్లో సైతం ముందుండి మండలాన్ని మంచి పేరు తీసుక రావాలని క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాక్టరు యూనియన్ నాయకులు ప్రశాంత్, ఎ అర్ ఎస్ ఐ గద్దరాసి శంకర్, టిఎస్ఎస్పి కానిస్టేబుల్ బొడ ప్రశాంత్, పిడి ప్రతాప్ కుమార్, పిఈటి లు ప్రవీణ్, సత్తిష్, అర్గనేజర్స్ ప్రవీణ్, అజేయ్ , నరేష్, క్రీడాకారులు ప్రవీణ్, సత్తిస్, రాకేష్, గౌతమ్, సునీల్,ప్రశాంత్, గణేష్, తదితరులు పాల్గొన్నారు