మిచౌంగ్ తుఫాన్ తో అప్రమత్తంగా ఉండాలి

– ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
– ఊరట్టం టూ కొండాయి రోడ్డును పరిశీలించిన కలెక్టర్
నవతెలంగాణ -తాడ్వాయి
నేడు రేపు రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ తుఫాన్ వర్షాల నేపథ్యంలో ఏజెన్సీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం మండలంలోని మేడారం సమీపంలోని ఊరట్టం టూ కొండాయి రోడ్డును, కొండేటి వాగు పై నూతనంగా నిర్మించిన లో లెవెల్ రోడ్డాం ను, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కుంగిపోయిన కొండాయి బ్రిడ్జిని పరిశీలించారు. మిచౌంగ్ తుఫాన్ తీవ్రంగా పెరిగితే,  కొండాయి, మల్యాల, కొత్త కొండాయి, జంపన్న కాలనీ తదితర గ్రామాల ప్రజలకు అంతరాయం ఏర్పడితే, ఆ ప్రజలను ఊరటం, లేదా మేడారం గ్రామాలకు తరలించడానికి ఊరట్టం రోడ్డు మార్గాన్ని, ఆర్ అండ్ బి అధికారులతో కలిసి పరిశీలించారు. గతంలో తుఫాను సందర్భంగా కొండాయి గ్రామంలో ఐదుగురు మృతిచెందగా అలాంటి సన్నివేశం పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మాట్లాడుతూ తుఫాన్ నేపథ్యంలో ములుగు జిల్లా అను రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ముఖ్యంగా జంపన్న వాగు పొడుగుతా ఉన్న గ్రామాల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరారు. అవసరమైతే తప్ప బయటకి రాకూడదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. జిల్లాలోని అధికారులు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సూచించారు. ఆమె వెంట ఆర్ అండ్ బి అధికారులు ఈఈ వెంకటేశ్వర్లు, డిఈ రఘువీర్, ఏఈ ప్రమోద్, కొండాయి సర్పంచ్ కాక వెంకటేశ్వర్లు, కాంట్రాక్టర్ పిన్నింటి యాదిరెడ్డి తదితరులు ఉన్నారు.