
చౌటుప్పల్ మండలములోని దండు మల్కాపురం గ్రామంలో యాదాద్రిభువనగిరి జిల్ల ముఖ్య కార్య నిర్వాహణాధికారి ఎస్. శోభారాణి శనివారం పర్యటించి రాష్టంలో కురుస్తునన భారీ వర్షాల వలన జరుగు విప్త్తుల ధృష్ట ముందస్తూ చర్యలు తీసు నుటకు గ్రామంలో పర్యటించి చర్యలు చేపట్టారు.గ్రామలలో శానిటేషన్ చేయంచుట,వాటర్ పైపులు లీకేజీ లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను సీఈఓ ఆదేశించారు.సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా బ్లీచింగ్ పౌడర్ ఆయిల్ బాల్స్ స్టాక్స్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు. అనంతరం గ్రామంలో వనమోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి నీళ్ళు పోశారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి కే.ప్రమోద్ కుమార్ మండల పంచాయతీ అధికారి కే. నరసింహారావు ఏఈఒ,ఏపీవో,పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.