సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి– ప్రభుత్వ కార్యాలయ ఆవరణంలో పచ్చదనం పరిశుభ్రత నిర్వహించాలి
– జిల్లా కలెక్టర్‌ క్రాంతి వల్లూరు
నవతెలంగాణ-కల్హేర్‌
మండల కేంద్రంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయ ఆవరణాల్లో, పాఠశాలల్లో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం చేపట్టాలని.. వర్షాకాలం కాబట్టి సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ క్రాంతి వల్లూరు అన్నారు. మండల కేంద్రమైన కల్హేర్‌లోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని, నిజాంపేట మండలoలోని ట్రైబల్‌ వెల్ఫేర్‌ మినీ గురుకులాన్ని బుధవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీజనల్‌ వ్యాధుల కాలాన్ని దష్టిలో పెట్టుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యమే ధ్యేయంగా పాఠ శాలలో పచ్చదనం-పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాల న్నారు. తాగునీరు కలుషితం కాకుండా పైప్‌లైన్‌ లీకేజీలను అరికట్టాలన్నారు. సీజనల్‌ వ్యాధుల నియంత్రణ, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ.. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఎక్కడైనా వ్యాధులు ప్రబలితే తక్షణమే వైద్య క్యాంపులు నిర్వహించి వ్యాధుల నియం త్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా నీళ్లు, ఆహార కల్తీ వల్ల డయేరియా వంటి వ్యాధులు ప్రబలు తాయని, ప్రజలు జాగ్రత్తలు పాటించే విధంగా అవగాహన కల్పించాలన్నారు. వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిం చాలని సూచించారు. అన్ని సంక్షేమ హాస్టళ్లను ప్రత్యేక అధికా రులు తనిఖీ చేసి పారిశుధ్యం ఆహార తనిఖీలు చేపట్టాల న్నారు. దోమలు నివారణ చర్యలు పాటించాల న్నారు. వన మహౌత్సవంలో భాగంగా ప్రతి పాఠశాలల్లో అవెన్యూ డ్రైవ్‌ చేపట్టాలన్నారు. నాటిన ప్రతీ మొక్కను జియో ట్యాగిం గ్‌ చేయాలని సూచించారు. నూటికి నూరు శాతం మొక్కలు నాటి పచ్చదనం విస్తరించే విధంగా ఉండలన్నారు. వైద్యు లు, సిబ్బంది అందరూ సమయ పాలన పాటిస్తూ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా అంకిత భావంతో విధులు నిర్వర్తించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసర మైన మందులను అందుబాటులో ఉంచాలని వైద్యులకు సూచించారు. రాత్రి వేళల్లో డాక్టర్లు వైద్య సిబ్బంది అందు బాటులో ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే రోగులను పంపాలని, ప్రైవేట్‌ ఆసుపత్రులకు రోగులను పంపించొద్దని ఆదేశిం చారు. ఈ కార్యక్ర మంలో ఖేడ్‌ ఆర్డిఓ అశోక్‌ చక్రవర్తి, తహ సీల్దార్లు నాగజ్యోతి, వెంకటేశ్వర్లు, ఎంపడీఓ శ్రీనివాసులు, ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్‌ అనిల్‌రెడ్డి, గురుకుల ఉపాధ్యాయులు నిర్మల, పుష్పలత, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.