– ప్రైవేట్ ఆసుపత్రులు నిబంధనలు పాటించాలి: డిఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
జిల్లాలో ఫీవర్ సర్వే చేయాలని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డిఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ సూచించినారు. నల్లగొండ జిల్లాను అన్నీ జాతీయ కార్యక్రమాలలో ముందంజలో ఉంచాలని అన్నారు. జిల్లాలోని అన్నీ ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తామని తెలిపారు. శనివారం డిఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లాలోని అన్నీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లకు రివ్యూ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన వైద్యశాఖ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. నల్లగొండ జిల్లాను అన్నీ జాతీయ కార్యక్రమాలలో ముందంజలో ఉంచాలని సూచించారు. జిల్లాలోని అన్నీ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్ లు, అయూష్ క్లినిక్స్, డయాగ్నోస్టిక్ సెంటర్లు వారు అందరూ కూడా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆక్ట్ ప్రకారము నియమ నిబందనలు అనుసరించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయములో రిజిస్ట్రేషన్ చేయించాలని తెలిపినారు. ప్రతి ప్రైవేట్ ఆసుపత్రులలో బోర్డుపై డాక్టర్ల వివరాలు, ఫీజుల వివరములు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించి నార్మల్ డెలివేరీస్ పెంచాలని సూచించారు. సిజేరియన్ ఎక్కువగా అయిన ఆసుపత్రులను ఆడిట్ చేయడం జరుగుతుంది. నిబందనల ప్రకారము అన్నీ ప్రమాణాలు పాటించాలని సూచించినారు. నిబంధనలు పాటించని వారిపై క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆక్ట్ ప్రకారము చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమములో ప్రోగ్రాం ఆఫీసర్లు, ఉప జిల్లా వైద్యాధికారులు, డెమో, ఫార్మసీ సూపర్వెజర్, మెడికల్ ఆఫీసర్లు, ఎంఎల్ హెచ్ పి లు పాల్గొన్నారు.