సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

వరంగల్ జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ
నవతెలంగాణ – రాయపర్తి
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వరంగల్ జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ డాక్టర్లకు, సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం మండలంలో ప్రభుత్వ ఆసుపత్రితో పాటు మైలారం, మోరిపిరాల సబ్ సెంటర్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో సాధారణంగా మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, రక్త విరోచనాలు, నీళ్ల విరోచనాలు, హెపటైటిస్ మొదలగు వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంటుంది కనుక సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టి ముందస్తు జాగ్రత్తలు ఇవ్వాలని తెలిపారు. గర్భిణీ స్త్రీలకు అందించవలసిన సేవలను క్రమము తప్పకుండా అందించాలి అన్నారు. ప్రతి గర్భిణీ స్త్రీని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించటట్లు ప్రోత్సహించాలని కోరిరు. 30 సంవత్సరాల పైబడిన వారందరికీ హైపర్ టెన్షన్, మధుమేహము, క్యాన్సర్, మెదడుకు సంబంధించిన ఎపరీక్షలు నిర్వహించి తగిన చికిత్సలు అందించాలని తెలిపారు. సిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు  డాక్టర్ ఐశ్వర్య, డాక్టర్ నేహా ఫాతిమా, డాక్టర్ జ్యోస్నా, డాక్టర్ అనిత,  డిప్యూటీ డెమో అనిల్ కుమార్, సూపర్వైజర్ మాధవి, కిర్య, మేరీ, వసంత  సిబ్బంది పాల్గొన్నారు.