నవతెలంగాణ-జైపూర్
సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలని జైపూర్ ఎసీపీ వెంకటేశ్వర్లు సూచించారు. మండల కేంద్రంలోని కేజీవిబి పాఠశాలలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు సోమవారం స్థానిక ఎస్సై శ్రీధర్‌తో కలిసి పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు పాఠశాల పరిసరాలను పరిశీలించిన ఆయన విద్యార్థులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందవద్దని ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు.. కష్టపడి చదువుకుని ఉన్నత స్థాయిలో స్థిరపడాలని, కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.