సంక్రాంతి పండుగకు ఊరెళ్తున్నారా.. జర జాగ్రత్త

– ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌ రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
పహడి షరీఫ్‌, బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్లు పరిధిలో ఉన్న ప్రజలు సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్ళే సమయంలో పలు జాగ్రత్తలు తీసు కోవాలని బాలాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌ రెడ్డి తెలిపారు. పండుగ కోసం ఊరు వెళ్లాల్సి వస్తే మీ విలువైన బంగారు, వెండి, ఆభర ణాలు, డబ్బులు, బ్యాంక్‌ లాకర్లలో భద్రపర్చుకోవాలని లేనిచో మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోవాలని ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెలవులలో బయటకు వెలుతు న్నప్పుడు సెక్యూరిటి అలారం, మోషన్‌ సెన్సర్‌ ను ఏర్పాటుచేసుకోవడం మంచిందన్నారు. మీ ఇంటికి సెంట్రల్‌ లాక్‌ సిస్టమ్‌ గల తాళము అమర్చు కునడం మంచిదన్నారు. తాళము వేసి ఊరికి వెళ్లవల్సి వస్తే స్థానిక పోలీసు స్టేషన్‌ లో సమాచారం ఇవ్వలన్నారు.మీ కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్‌ స్టేషన్‌ కు సమాచారం ఇవ్వాలని, లేదా 100 నెంబర్‌ కు తప్పనిసరిగ ఫోన్‌ చేయాలన్నారు. వాహనాలను మీ ఇంటి ఆవరణలోనే పార్కు చేసుకొవాలని, ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా తాళాలు వేయాలని మీకు వీలైతే చక్రాలకు చైన్స్‌ తో కూడా లాక్‌ వెయ్యడం మంచిదన్నారు.నమ్మకమైన వ్యక్తులను మాత్రమే వాచ్మెన్‌, సెక్యూరిటీ గార్డ్‌ సర్వెంట్‌ లను నియమించుకొవాలన్నారు.మీ ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలకు అన్‌ లైన్‌ లో ఎప్పటికప్పుడు చూసుకొంటూ ఉండాలన్నారు. ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు చెత్త చెదారం, పాలప్యాకెట్లు జమ కానివ్వకుండా చూసుకోవాలని, వాటిని కూడా గమనించి నేరస్తులు దొంగతనాలకు పాల్పడుతారన్న విషయాన్ని గమనించాలన్నారు. ఇంటికి ప్రధాన ద్వారంనకు తాళం కప్ప వేసినప్పటికి అవి కనిపించకుండా కర్టెన్స్‌ తో కవర్‌ చేయడం మంచిదన్నారు. బయటకు వెళ్ళేటప్పుడు ఇంటి లోపల, బయట కూడా కనీసం కొన్ని లైట్లు వేసివుంటే మంచిదని తెలిపారు. ఇంటి దగ్గర గల మీకు నమ్మకమైన ఇరుగు పొరుగు వాళ్ళకు మీరు ఇంట్లో లేని సమ యంలో మీ ఇంటిని గమనిస్తు ఉండమని చెప్పడం మంచిదన్నారు. అల్మరా కప్‌ బోర్డ్స్‌ కు సంభందించిన తాళాలు ఇంట్లోనే రహస్య ప్రదేశంలో పెట్టుకోవడం మంచిదన్నారు. బంగారు ఆభరణాలు వేసుకొని ఫంక్షన్‌ లకు గుడికి వెళ్ళే టప్పుడు తగు జాగ్రతలు తీసుకోవడం మంచిద న్నారు.ఈ కార్యక్ర మంలో పోలీస్‌ సిబ్బంది,పలు కాలనీల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.