నవతెలంగాణ- జుక్కల్: మాయా మాటలు నమ్మి ఓటేయకండి మెసపోతారని జుక్కల్ ఎమ్మెలే హన్మంత్ షిండే అన్నారు. మంగళ వారం నాడు మండలంలోని పెద్ద గుల్లా, గుల్లా తాండా, బస్వాపూర్, ఖండేబల్లూర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎమ్మెలే షిండే మాట్లాడుతు రాష్టప్రభూత్వం కొత్త మెనిఫెస్టో తయారు చేసామని మహిళలకు అర్థిక సహయం, నాలుగు వందలకే గ్యాస్ సిలెండర్, రైతులకు పంటకు పదహరు వేలు, మహిళలకు గ్రామాలలో సమీవేశ బిల్డింగ్ కట్టిస్తామని, అసర పెన్షన్ దశల వారిగా పెంచుతామవి అందరికి సన్నబియ్యం ఇవ్వడం జర్గుతుందని తెలిపారు. పెద్ద గుల్లాలో మాట్లాడుతు దత్తాత్రేయునిగా సాక్షిగా గ్రామాన్ని పూర్తీ స్థాయిలో గెలిచిన తరువాత ఆభివృద్ది చేస్తానని హమీ ఇచ్చారు. గుల్లా తాండాలో మాట్లాడుతు ముఖ్యమంత్రి కేసిఆర్ కామారెడ్డి నుండి పోటీ చేస్తున్నారని , అనంతరం నిరుపేద గిరిజనలకు గిరిజన బంధు కూడా దశల వారిగా ప్రవేశ పెట్టెందుకు ఆలోచనలు జర్గుకున్నాయని అన్నారు. బస్వాపూర్ లో మాట్లాడుతు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నియేాజక వర్గంలో 12వేల మందికి ఒకేసారి దళితబంధు ఇచ్చె విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఖండేబల్లూర్ లో మాట్లాడుతు గ్రామములోని ఇండ్లు లేని వారికి తప్పక డబల్ బెడ్ రూం లు ఇస్తామని, జాగా లేని వారికి జాగా ఇచ్చి కట్టిస్తామని హమి నిచ్చారు. ప్రస్తుతం ఉన్న అన్ని పథకాలు యదావిధిగా కొనసాగీస్తామని పేర్కోన్నారు. కాంగ్రెస్ , బీజేపీకి అబ్యర్థులు లేక నిజామాబాద్, సంగారెడ్డి నుండి వలస తెచ్చినారని వమర్శించారు. తాను ఎప్పుడు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ ప్రచారం కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీటీ అద్యక్షుడు మాదారావ్ దేశాయి, మాజీ అద్యక్షుడు బొల్లి గంగాధర్, సీనీయర్ నాయకులు నీలుపటేల్, సాయాగౌడ్, గుల్లాతాండా జాదవ్ రాజు, సుదు , కిషన్, రంజిత్ సౌకార్, శివరాజ్ దేశాయి, కపిల్ పటేల్, సదుపటేల్, శీవాజీపటేల్, సర్పంచులు గుల్లా తాండా అనుషాబాయి, పెద్గ గుల్లా ఉపసర్పంచ్ గణేష్, బస్వాపూర్ రవిపటేల్, మాజీ సర్పంచులు , ఎంపిటిసిలు, గ్రామపార్టీ అద్యక్షులు, మహిళలలు, యువకులు తదితరులు పాల్గోన్నారు.