నవతెలంగాణ – భీంగల్
దోమలు కుట్టకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని మండల విద్యాధికారి స్వామి తెలిపారు. బుధవారం పట్టణ కేంద్రంలోని బోయ గల్లి లో గల బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు దోమల వల్ల వ్యాపించే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ఇంటి పరిసరాలలో, టైర్లు, కొబ్బరి బోండాలలో నిలువ ఉన్న మురికి నీటిపై దోమలు నిలువ ఉంటాయని వీటితో డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా లాంటి వ్యాధులు వస్తాయని కనుక పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఏం యువ తెలిపారు. అలాగే వర్షాకాలం తీవ్రతలు ప్రబలే అవకాశాలు ఉన్నందున ప్రతి వ్యక్తి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు లింబాద్రి ఉపాధ్యాయులు వాసుదేవ్, రఘు వాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.