వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త వహించాలి: డీఎంహెచ్ఓ

నవతెలంగాణ – నూతనకల్
వేసవిలో ప్రజలంతా వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్త వహించాలని డిఎంహెచ్వో డాక్టర్ కోటా చలం అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి మంగళవారం నిర్వహించే ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవిలో సంభవించే వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ఎక్కువగా ద్రవపదార్థాలు సేవించాలని, పలుచని కాటన్ దుస్తులు ధరించాలని, ఎక్కువ నీటిని సేవించాలని, పరిశుభ్రమైన భోజనం చేయాలని,రెండు పూటల స్నానం చేస్తూ ఎండలో ఎక్కువగా బయటకి వెళ్లకూడదని ప్రజలకు సూచించారు. అనంతరం ఆరోగ్య మహిళా కార్యక్రమంలో నిర్వహించవలసిన పరీక్షలను గురించి తెలియజేశారు. రికార్డులను పరిశీలించి చూశారు. అనంతరం ఆశ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి కీసర ఆశ్రిత, పిహెచ్ఎన్ తారమ్మ, సూపర్వైజర్లు, ఎంఎల్ హెచ్ పీ లు, సిస్టర్స్, మెయిల్ స్టాఫ్, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.