రాజన్న భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలి..

Be polite to Rajanna's devotees.నవతెలంగాణ – వేములవాడ 
రాజన్న భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలి..భక్తి భావం పెంపొందించేలాగా ఆటో డ్రైవర్ల ప్రవర్తన ఉండాలని సీఐ వీర ప్రసాద్ హెచ్చరించారు.  శనివారం వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ , కోరుట్ల బస్టాండ్, జగిత్యాల బస్టాండ్ ఆటో డైవర్స్ తో అలాగే ఆటో ఓనర్లతో సిఐ సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. రాజన్న దర్శనానికి వచ్చే  భక్తుల పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని, దురుసుగా ప్రవర్తించకూడదని  సూచనలు చేశారు.   రానున్న శ్రావణమాసంలో రాజన్న దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని వారి పట్ల మర్యాదపూర్వకంగా భక్తి భావం పెంపొందించేలాగా ఆటో డ్రైవర్ల ప్రవర్తన ఉండాలని అన్నారు. అలాగే ఆటో కేపాసిటి మించి ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకుంటే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ యూనిఫామ్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, వాహన పేపర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. కెపాసిటీకి మించి వాహనాలు నడిపినట్లు అయితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్లపై సైడ్ తీసుకొని వాహనాన్ని ఆపి ప్రయాణికులను ఎక్కించుకొని గమ్య స్థలానికి చేర్చాలని అన్నారు. వాహనాల్ని ఎలా పడితే అలా సడన్ బ్రేక్ వేస్తే వెనుక వచ్చే వాహనాలకు ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రమేష్, ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ తో పాటు ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.