మీరు తప్పకుండా రండి.. మీ మిత్రులకు తెలియజేయండి

నవతెలంగాణ – పెద్దవూర
సమాచార హక్కు వికాస సమితి  నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం 2005 పై ఈ నెల 7 వ తేదీన అవగాహన సదస్సు ప్రస్తుత పరిస్థితులు భవిష్యత్తు కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని సమాచార హక్కు చట్జం వ్యవస్థాపక అధ్యక్షులు యారమాద కృష్ణారెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు. శుక్రవారం నవతెలంగాణ తో మాట్లాడారు.మిర్యాలగూడ పట్టణం లోని ఆర్డీ ఓ కార్యాలయం ఎదురుగా ఆర్య సమాజం మందిరం  లో  మధ్యాహ్నం ఒకటి గంట నుండి మూడు గంటల వరకు అవగాహన సదస్సు ఉంటుందని అన్నారు.కావున  నల్గొండ జిల్లాలోని జిల్లా కమిటీ సభ్యులు నియోజకవర్గ కమిటీ సభ్యులు మండలాల కమిటీల సభ్యులు ఆయా కమిటీల బాధ్యులు,ప్రతి సభ్యుడు  సమయానికి హాజరుకావాలని తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్  వెంకటేష్,నల్లగొండ జిల్లా ఆర్టిఐ మానిటరింగ్ కమిటీ సభ్యులు జిల్లా అధ్యక్షులు బైరు సైదులు గౌడ్, జిల్లా ప్రథాన కార్య దర్శి చిత్రం శ్రీనివాస్,జిల్లా కమిటీ ముఖ్యులు హాజరవు తున్నారని తెలిపారు. కావున సభ్యులు తప్పని సరిగ్గా సభ్యులు  సమయానికి హాజరు కావాలని తెలిపారు.మిర్యాలగూడ  నియోజక వర్గ పరిధిలో వున్న ప్రతి ఒక్క సభ్యుడు తప్పని సరిగా హాజరు కావాలని అన్నారు. హాజరు కానిచో వారి సభ్యత్వం రద్దు చేయబడుననిఅన్నారు. అదేవిధంగా దేవరకొండ,నల్లగొండ నాగార్జున సాగర్  నియోజక వర్గాల నుండి ముఖ్యులు కమిటీల్లో ని బాధ్యులు తప్పనిసరిగ హాజరు కావాలని తెలిపారు.