అండగా ఉండి ఆదుకుంటా..

– మంత్రి హరీష్ రావు
నవతెలంగాణ – చిన్నకోడూరు
మృతుల కుటుంబాలకు అండగా ఉండి ఆదుకుంటానని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ అన్నారు. చిన్నకోడూరు మండలంలోని కమ్మర్ల పల్లి, మైలారం, అల్లిపూర్,చెలకల పల్లి గ్రామాలలో మృతుల కుటుంబాలను శనివారం మంత్రి పరామర్శించారు. ఇటీవల రంగధాంపల్లి రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మైలారం గ్రామానికి చెందిన బిఆర్ ఎస్ వి గ్రామ శాఖ అధ్యక్షుడు బూరుగు వెంకటేష్ గౌడ్, కమ్మర్లపల్లి గ్రామానికి చెందిన జక్కుల నాగరాజు యాదవ్ మృతి చెందారు. అల్లిపూర్ గ్రామానికి చెందిన సత్తవ్వ, కొత్త కొండ మల్లయ్య, చెలకలపల్లి గ్రామానికి చెందిన లక్కపాక లింగం శుక్రవారం మృతి చెందారు. వీరి కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. మృతుల కుటుంబాలకు ఎళ్లవేళల అండగా ఉండి ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మీ ఇంటి పెద్ద కొడుకులా నేను ఉన్నా…అధైర్య పడవద్దు ధైర్యంగా ఉండాలని మనోధైర్యం నింపారు. మంత్రి వెంట ఎంపిపి కూర మాణిక్య రెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, ఎంపీపి ఉపాధ్యక్షులు కీసర పాపయ్య ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపిటీసిలు, మండల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.