పారిశుధ్య పనుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

– అదనపు కలెక్టర్‌ గరీమా అగర్వాల్‌
నవతెలంగాణ – హుజురాబాద్‌ : పట్టణాలు పరిశుభ్రంగా ఉండేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం పనుల పట్ల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్‌ అదనపు కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ అన్నారు. బుధవారం హుజురాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని 22, 29, 2, వార్డుల్లో పనులను ఆమె పరిశీలించారు. మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో జరుగుతున్న డిఆర్సిసి, ఇతర ప్రాంతాల్లో త్రిబుల్‌ ఆర్‌, డంపింగ్‌ యార్డ్‌ పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఈఈపిహెచ్‌ సంపత్‌రావు, కమిషనర్‌ ఎస్‌.సమ్మయ్య, మున్సిపల్‌ అధికారులు సాంబరాజు, కిషన్‌రావు, వినరు, సిబ్బంది ప్రతాప్‌రాజు, అనిల్‌, రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.