సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి 

Be vigilant against cyber crimesనవతెలంగాణ – పెద్దకొడప్ గల్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ కార్యక్రమాన్ని కొందరు సైబర్ నేరగాళ్లు అలుసుగా తీసుకొని డబ్బులు కొట్టేసి ప్రమాదం ఉందని ఎస్సై కోన రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కావున మండలంలోని ప్రజలందరూ రుణమాఫీ సంబంధిత సమాచారం కొరకు దగ్గర్లో ఉన్న  సొసైటీలో గాని, అగ్రికల్చర్ కార్యాలయం నందు సమాచారం తీసుకోవాలి అని ఆయన తెలిపారు. మండలంలోని చాలామంది వ్యవసాయం చేస్తూ నిరక్షరాస్య కలిగిన వారు ఉన్నారు కనుక తెలియని వారు ఎవరైనా ఫోన్ చేసి మీకు రుణమాఫీ వచ్చిందని మీ ఆధార్ కార్డ్ నంబర్ కానీ ఏటీఎం నెంబర్ కానీ మీ ఫోనుకు వచ్చిన ఓటీపీలు కానీ ఎవరికి తెలియపరచద్దని రైతులను సూచించారు రుణమాఫీ పేరుతో వచ్చినటువంటి లింకులపై క్లిక్ చేయొద్దని, ఏదైనా నేరానికి గురి అయితే వెంటనే ఆలస్యం చేయ్యకుండా 1930 కి కాల్ చేసి చెప్పాలని ఆయన తెలిపారు.