- ఎస్ ఐ వీరబాబు
నవతెలంగాణ -పెద్దవూర: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పెద్దవూర ఎస్ఐ వీరబాబు అన్నారు. మంగళవారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాను సారాంశం మండల కేంద్రం లోని కస్తూరీభాగాంధీ ఉన్నత పాఠశాల లో పోలీస్ జాగృతి కళా బృందం ఆధ్వర్యంలో సైబర్‌నేరాలు, మూఢనమ్మకాలపై విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని చెప్పారు. సైబర్‌నేరాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫీక్ నిబంధనలు పాటించాలన్నారు. యువత గంజాయి, డ్రగ్స్, మాదక ద్రావ్యాలకు దూరంగా వుండాలన్నారు.అలాగే సోషల్ మీడియా ప్రభావం చదువులకు అడ్డంకిగా మారిందని వీటికి దూరంగా వుండాలన్నారు. బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు నేరమని తల్లిదండ్రులు బాల్య వివాహాలు చేస్తే చట్ట రీత్యానేరమని తెలిపారు. ద్వీచక్ర వాహనదారుడు హెల్మెంట్ ధరించాలని, కారు నడిపేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, పోలీస్ కళాజాత సిబ్బంది,విద్యార్థులు పాసల్గొన్నారు.