– ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వజ్రాయుధం
– సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
రాబోవు 72 గంటలు చాలా కీలకమని అక్రమంగా మద్యం, డబ్బులు తరలించే అవకాశం ఉంటుందని విధుల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సిద్దిపేట పోలీస్ కమిషనర్ బి అనురాధ ప్రదేశించారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్ లో ఉన్న స్ట్రాంగ్ రూమ్, పట్టణంలో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని, జిల్లెల్ల గడ్డలో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ సందర్శించారు. అనంతరం హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ షాపింగ్ కాంప్లెక్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా సిద్దిపేట సిపీ మాట్లాడుతూ చెక్ పోస్టు వద్ద విధులు నిర్వహించే సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
ఈవీఎంస్ భద్రపరిచిన రూమ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పరిసర ప్రాంతాలను ఈవీఎంస్ భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాలలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసే విధంగా అన్ని చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఎన్నికల సందర్భంగా జిల్లా పోలీసు అధికారులు మొత్తం 2482 మందితో పటిష్టమైన బంధువస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో కేంద్ర పారా మిలిటరీ దళాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ 11, స్టాటికల్ సర్వలెన్స్ టీమ్స్ 11,మోడల్ కండక్ట్ కోడ్ టీమ్స్ 26 ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ స్టేషన్ లు 1010 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లు 122, నార్మల్ పోలింగ్ స్టేషన్ లు 888, పోలింగ్ లొకేషన్ లు 626, క్రిటికల్ పోలింగ్ లోకేషన్లు/51, నార్మల్ పోలింగ్ లొకేషన్ లు 575 ఉన్నాయన్నారు. ఇప్పటివరకు రూ.1,66,91,450 నగదును సీజ్ చేశామన్నారు. ఎక్సైజ్ కేసులు 236 చేసినట్లు పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వజ్రాయుధం
లోక్ సభ ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సిపి అనురాధ సూచించారు. ఓటు వజ్రాయుధమని ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ద్వారా ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడంలో ఓటు యొక్క ప్రాధాన్యత చాలా గొప్పదన్నారు. ఓటు హక్కును ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా మీకు నచ్చిన వ్యక్తి కి ఓటు వేసే ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తామని తెలిపారు. ఓటు విషయంలో ఎవరైనా బెదిరింపులకు పాలుపడితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని, లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712667100 లేద డయల్ 100 కాల్ చేయాలని చేసి సూచించారు. మద్యానికి డబ్బులకు మరే ఇతర వస్తువులకు బానిసలు కావద్దని, మీకు నచ్చిన మెచ్చిన అభ్యర్థికి నిజాయితీగా, నిర్భయంగా ఓటు వేసి ఓటింగ్ శాతాన్ని పెంచాలని సూచించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపించడానికి అన్ని రకాల ప్రణాళికలు తయారు చేశామన్నారు. గ్రామాలలో ఏ పార్టీ వారు వచ్చి ప్రచారం చేసిన అడ్డుకోవద్దని ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చని మీకు నచ్చిన మెచ్చిన వ్యక్తికి ఓటు వేయండి కానీ ప్రచారాన్ని మాత్రం అడ్డుకోవద్దని అడ్డుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో పారామిలటరీ దళాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపినారు. ఎన్నికల సంఘం ప్రవర్తన నియమావళి కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఏసిపి సతీష్, సీఐ శ్రీనివాస్, ఎలక్షన్ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ గౌడ్, ఎస్బి ఇన్స్పెక్టర్ కిరణ్, హుస్నాబాద్ ఎస్ఐ మహేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.