– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జహంగీర్
నవతెలంగాణ-బీబీనగర్
కార్పొరేట్ పార్టీలైన బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని ఆ పార్టీ మండల కార్యాలయాన్ని స్థానిక నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యం, సమగ్ర అభివద్ధి జరగాలంటే పీడిత ప్రజలకు గొంతుకైన సీపీఐ(ఎం)ను గెలిపించాలని కోరారు. నిత్యం ప్రజల పక్షాన ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న సీపీఐ(ఎం) అభ్యర్థి కొండమడుగు నరసింహను గెలిపించి అసెంబ్లీకి పంపించాలన్నారు. అసెంబ్లీకి పంపించడం ద్వారా ప్రజలకు పోరాటాలకు మరింత బలం చేకూరుతుందని తద్వారా అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాలతో పాటు చట్టసభల్లో కూడా పోరాటం చేసే హక్కుల సాధించుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. వామపక్ష ,ప్రజాతంత్ర, లౌకిక, సామాజికంగా పోరాడే శక్తులను బలపరచండి. బీజేపీదాని మిత్రులను ఓడించండి అనే నినాదాలతో పోటీ చేసిందన్నారు. నాడు జరిగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట గడ్డమీద ఎర్రజెండా నాయకత్వంలో అనేక ప్రజాపోరాటాలు నిర్మిస్తున్నామని విజయాలు సాధిస్తున్నామని పోరాటంలో ఊపిరిగా, ప్రజా సమస్యలే పరిష్కారమే ధ్యేయంగా, ఉద్యమిస్తున్నసీపీఐ(ఎం) ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు ఆదరించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరు మల్లేశం, మండల కార్యదర్శి గాడి శ్రీనివాస్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు సందెల రాజేష్, మాజీ మండల కార్యదర్శి బండారి శ్రీరాములు, మండల కమిటీ సభ్యులు ఉమార్, సత్యనారాయణ, రంజిత్, మాజీ మండల కమిటీ సభ్యులు హరికష్ణ, సురేష్ ,పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.