మండలంలోని గొడుగు మర్రి తాండ గ్రామపంచాయతీ పరిధిలోని సున్నపు రాళ్ల తండాకు అన్నారం రోడ్డు నుండి బీటీ రోడ్డు పనులను గురువారం ప్రజాప్రతినిధులు,నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఉపసర్పంచ్ రవి నాయక్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల తండా వాసుల కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది దాని, సహకరించిన ప్రజాప్రతినిధులకు, నాయకులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మద్దికుంట నర్సాగౌడ్, స్వామి గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, చిన్న గంగారెడ్డి, ఎండి సల్మాన్, దయానంద్, పూజారి రాజు నాయక్, తదితరులు పాల్గొన్నారు.