రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే శుక్రవారం మీడియాతో ముచ్చటించారు. మాది మహారాష్ట్రలోని ఔరంగాబాద్. మా నాన్న ఉద్యోగ రీత్యా లాగోస్ (నైజీరియా) షిఫ్ట్ అయ్యారు. బిజినెస్ మేనేజ్‌మెంట్ కోసం ముంబై వచ్చినప్పుడు మోడలింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చాను. తర్వాత కొన్ని కమర్షియల్స్ చేశాను. మంచి అవకాశం ఎదురు చూస్తున్నప్పుడు ఈ సినిమా కోసం ఇచ్చిన ఆడిషన్‌లో ఎంపికయ్యాను. నా తొలిసినిమానే రవితేజతో నటించడం ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ఇందులో నా పాత్ర పేరు జిక్కీ. తెలుగు మార్వాడి గర్ల్. చాలా క్యూట్, లవబుల్. డైరెక్టర్ ఈ క్యారెక్టర్‌ని చాలా బ్యూటీఫుల్‌గా తీర్చిదిద్దారు. బచ్చన్ లైఫ్‌లో జిక్కీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇందులో క్యాసెట్ రికార్డింగ్ షాప్‌లో ఓ సీన్ ఉంటుంది. ఆ సీన్ చేసిన తర్వాత ‘ఐయాం ప్రౌడ్ అఫ్ యూ’ అని డైరెక్టర్ అన్నారు. అది నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తొలి సినిమాకే తెలుగులో డబ్బింగ్ చెప్పడం, పాటల్లో నా డ్యాన్స్ మూమెంట్స్ ట్రెండింగ్‌లో ఉండటం చాలా ఆనందంగా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్‌తో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్.