రమాదేవి ప్రొడక్షన్స్ పతాకంపై నూతన తారాగణంతో తెరకెక్కుతున్న ఫీల్ గుడ్‌ఎంటర్టైనర్ ‘వైభవం’. సాత్విక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రుత్విక్ – ఇక్రా ఇద్రిసి జంటగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రంలోని ‘పల్లె వీధుల్లోన’ పాటను మేకర్స్ విడుదల చేశారు. చిన్ననాటి జ్ఞాపకాలను, తల్లిదండ్రుల ప్రేమను, స్వచ్ఛమైన స్నేహాన్ని, పల్లె వైభవాన్ని గుర్తుచేసే ఈ పాటకు దర్శకుడు సాత్విక్ స్వయంగా సాహిత్యాన్ని, బాణీలను సమకూర్చగా, రితేష్ జి రావు ఆలపించారు. త్వరలోనే ఈ చిత్రం ఫస్ట్ కాపీ సిద్ధమవుతుందని, రానున్న రోజుల్లో మరిన్ని అప్‌డేట్స్ అందిస్తామని దర్శక, నిర్మాతలు తెలిపారు. రీసెంట్‌గా వచ్చిన సినిమాలతో పోలిస్తే మా చిత్రం చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఇందులోని మా పాత్రలు ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తాయి. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన మేకర్స్‌కి థ్యాంక్స్ అని హీరో, హీరోయిన్ రుత్విక్, ఇక్రా ఇద్రిసి చెప్పారు.