విశ్వక్‌సేన్ అప్ కమింగ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘లైలా’. ఇందులో ఆయన అమ్మాయి- అబ్బాయిగా కనిపించనున్నారు. రామ్ నారాయణ్ దర్శకుడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా మేకర్స్ ఫీమేల్ లుక్‌ని రిలీజ్ చేశారు. లైలా పాత్రలో విశ్వక్ సేన్ అద్భుతంగా ట్రాన్స్ ఫర్మేషన్ కావడం ఈ పోస్టర్‌లో చూడొచ్చు. ఈ చిత్ర టీజర్‌ను ఈనెల17న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా విశ్వక్‌సేన్ సరసన మెరవనుంది.