నాని తాజాగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హారు నాన్నా’. ఈ పాన్ ఇండియా చిత్ర గ్లింప్స్, టీజర్‌కు నేషనల్ వైడ్‌గా అద్భుతమైన స్పందన వచ్చింది. మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా చార్ట్ బస్టర్ నోట్‌లో స్టార్ట్ అయ్యాయి. మొదటి రెండు పాటలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఫస్ట్ సింగిల్ ‘సమయమా..’ పాటలో నాని, మణాల్ ఠాకూర్ మధ్య ప్రేమ, బాండింగ్‌ని అద్భుతంగా చూపించారు. రెండో పాట ‘గాజు బొమ్మ..’ తండ్రి, కూతురు పంచుకునే అందమైన అనుబంధాన్ని మనసుని హత్తుకునేలా చిత్రీకరించారు.
తాజాగా మేకర్స్ థర్డ్ సింగిల్ అప్డేట్‌తో వచ్చారు. థర్డ్ సింగిల్ ‘అమ్మాడి..’ పాటని నవంబర్ 4న విడుదల చేయనున్నారు. సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో నాని, మణాల్ ఠాకూర్ లవ్లీ కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. పోస్టర్ బట్టి చూస్తుంటే ఈ పాట బ్యూటీఫుల్ రొమాంటిక్ నెంబర్ అని అర్ధమౌతోంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించబోతున్న మరో చార్ట్ బస్టర్ సాంగ్ కోసం ప్రేక్షకులు ఎగ్జైటింగ్‌గా ఎదురుచుస్తున్నారు అని చిత్ర బృందం తెలిపింది. శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుండగా, బేబీ కియారా ఖన్నా నాని కుమార్తెగా కనిపించనుంది. వైర ఎంటర్‌టైన్ మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.