నవదీప్ చాలా గ్యాప్ తరువాత నటిస్తున్న చిత్రం ‘లవ్ మౌళి’. అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రశాంత్ రెడ్డి తాటికొండ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన నవదీప్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గుబురు గడ్డం.. ఒక బైక్.. ట్రావెలర్‌గా కనిపించి మెప్పించాడు. తాజాగా ఈ సినిమా నుండి ‘థ ఆంథమ్ ఆఫ్ లవ్ మౌళి’ సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘అందాలు చదివే కళ్లకైనా.. కందాలు తిరిగే కాళ్లకైనా.. వందేళ్లు కదిలే గుండె కైనా.. ప్రేమన్న తీరం ఇదేనా..’ అంటూ సాగే ఈ పాటలో నవదీప్ చాలా కొత్తగా కనిపిస్తున్నారు. గోవింద వసంత మ్యూజిక్ డైరెక్టర్‌గా ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన కంపోజ్ చేసిన ఈ పాటకు అనంత శ్రీరామ్ క్యాచీ లిరిక్స్ రాశారు. అనిల్ కష్ణన్ పాడిన విధానం అందర్నీ ఆకట్టుకుంటుంది. మేఘాలయలోని చిరపుంజీలో ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని చిత్రీకరించార. ఇలాంటి వెట్ ప్లేస్‌లో షూటింగ్ జరిగిన ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్‌గా ఈ చిత్రం నిలవడం ఓ విశేషమైతే, థారు కుడెం బ్రిడ్జి దగ్గర చిత్రీకరణ చేయటం మరో విశేషం అని నిర్మాత తాటికొండ ప్రశాంత్ రెడ్డి చెప్పారు.