నవతెలంగాణ – జన్నారం
బేడ, బుడగ జంగాలను ఎస్సీ డీ కేటగిరీలో చేర్చాలని బేడ బుడగ జంగాల నిర్మల్ జిల్లా అధ్యక్షుడు తూర్పాటి వెంకటేష్ అన్నారు. శనివారం మండలంలోని ఫోన్కాల్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని బుడగ జంగాల కాలనీలో ఇటీవలే మరణించిన గడ్డం రాజు కుటుంబానికి kp.5000 నగదు 50 కిలోల బియ్యాన్ని అందించారు. అనంతరం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ కేటగిరీలో ఉన్న బేడ బుడగజంగాలు విద్య పరంగా ఆర్థికపరంగా కడు దయనీయ స్థితిలో ఉన్నారన్నారు. ప్రభుత్వం బేడ బుడగ జంగాలకు ఇందిరమ్మ ఇళ్లలో ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా బేడ బుడగ జంగాలను ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని అభివృద్ధి పరచాలన్నారు. ఎస్సీ వర్గీకరణకు బేడ బుడగ జంగాలు అనుకూలం అన్నారు.. వర్గీకరణ జరిగితే తమను డి గ్రూప్ లో చేర్చి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వం అధికారులను కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో బేడ బుడగ సంఘాల నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డం గంగాధర్, ప్రధాన కార్యదర్శి మధు, మండల అధ్యక్షుడు గడ్డం రవి ఈర్నాల గంగన్న, నాయక్ శంకర్ రాజన్న మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.