– బీజేపీ శాసనసభా పక్షనేత మహేశ్వర్‌రెడ్డి ఆరోపణ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నదని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. బిల్లుల క్లియరెన్స్ కోసం ‘బీ’ ట్యాక్స్ పేరుతో 8 నుంచి 9 శాతం కమీషన్ తీసుకుంటున్నారని చెప్పారు. ‘బీ’ ట్యాక్స్ అంటే భట్టి ట్యాక్స్ ఏమో తనకు తెలియదని మంగళవారంనాడిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు. భూ కబ్జాలు చేసిన కేకే, రామ్మోహన్ కాంగ్రెస్‌లో చేరారనీ, హస్తం పార్టీలో వారు చేరగానే కడిగిన ముత్యాలు అయ్యారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు.