బీడీ కార్మికుల జీవన భృతి పెంచాలని ,ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాల నీ తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్య దర్శి ఎం,ముత్తన్న అన్నారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో బీడీ కార్మికులకు 4016/- జీవనభృతి పెంచాలని శనివారం పట్టణం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్టణంలోని వివిధ వార్డులు మామిడిపల్లి, పెర్కిట్, ప్రాంతాలలో బీడీలు చుట్టే కార్మికులు, ప్యాకింగ్ కార్మికులు, చాటన్ కార్మికులు, బట్టి వాళ, వాచ్మెన్లు ,ఆఫీస్ వర్కర్లు, ఇతరులు అనేక సంవత్సరాలుగా బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. గత కొంతకాలంగా వాళ్ల పరిస్థితి అయోమయంగా మారింది.వారానికి రెండు లేదా నెలకు వారం రోజుల కంటే ఎక్కువ పని దొరకడం లేదు అని అన్నారు. వారికి వారి కుటుంబానికి జీవనోపాధి కొనసాగించడానికి అనేక రకాలుగా ఆర్థికంగా, మానసికంగా, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం స్పందించాలి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి, నెలకు రూ.4016 రూపాయిల జీవన భృతిని పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం అని, బీడీ కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరుతున్నాం. కేసీఆర్ హయంలో బీడీ కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని మీ హయంలో నైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. బీడీ కార్మికులకు న్యాయం జరిగేంతవరకు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ పోరాడుతుందని, మునుమందు మరిన్ని పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు అరవింద్ ,తూర్పాటి శ్రీనివాస్ ,నజీర్, పద్మ, సునీత ,,లక్ష్మి, మమత, బీడీ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.