బీర్ల ఐలయ్యకు మినిస్టర్ పదవి ఇవ్వాలి

– జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దేశెట్టి చంద్రశేఖర్

నవతెలంగాణ_బొమ్మలరామారం 
బీర్ల ఐలయ్యకు మినిస్టర్ పదవి ఇవ్వాలని,జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దేశెట్టి చంద్రశేఖర్ అన్నారు.మండలంలోని మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆలేర్ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో బీసీ నాయకుడు బీర్ల ఐలయ్య గెలుపొందిన సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి మినిస్టర్ పదవి ఇవ్వాలని కోరారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను 10 ఏళ్ల తర్వాత గుర్తించిన ప్రజలకు ప్రత్యక్ష కృతజ్ఞతలు తెలిపారు.ఐలయ్య పార్టీకి అహర్నిశల కష్టపడి పనిచేశాడని,రాష్ట్ర ప్రజలు తెలంగాణ ఇచ్చిన పార్టీకి అధికారం కట్టబెట్టడం ఎంతో సంతోషమన్నారు.పార్టీ కోసం కష్టపడ్డ నాయకుడిని గుర్తించి మినిస్టర్ పదవి ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.