నిండుకుండలా బీఆర్ఎస్ పార్టీ

నవతెలంగాణ- నిజాంసాగర్: మండల కేంద్రంలోని మల్లూరు గ్రామం లోని కాంగ్రెస్ ముఖ్య నాయకులూ అయినా వంటి కొడిగంటి సాయిలు, సర్దార్ తమా అనుచరులతో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అయినా దుర్గరెడ్డి  సమక్షం లో బీఆర్ఎస్ లో చేరడం జరింగింది. ఈ సందర్భంగా డుర్గరెడ్డి గారు కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా దుర్గా రెడ్డి గారు మాట్లాడుతూ మండలంలో అభివృద్ధి ధ్యేయంగా చేసాం కాబట్టే ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఆయన అన్నారు. గత వారం రోజుల నుండి మండల కేంద్రంలో అన్ని గ్రామాలలో బీజేపీ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఆయన అన్నారు. ఈసారి భారీ మెజార్టీతో హనుమంత్ షిండే  ను గెలిపించుకుంటున్నామని ఆయన అన్నారు. ఇంకొన్ని రోజులలో కాంగ్రెస్, బీజేపీ క్యాడర్ కూడా మిగలదని ఆయన అన్నారు.  ఈ కార్యక్రమంలో శ్రీ నాగు ఫిన్ సొల్యూషన్ ఎండి నాగరాజ్ గారు వైస్ ఎంపీపీ మనోహర్, విటల్ రెడ్డి, బాబు సెట్  చాకలి సాయిరం, ఫాయుం, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.