రెజ్లర్ల ఆందోళనకు బెఫీ మద్దతు

హైదరాబాద్‌ : భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ చరణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు చేపట్టిన నిరసనకు మద్దతును ఇస్తున్నామని బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (బెఫీ) జనరల్‌ సెక్రటరీ దేబాసిస్‌ బసు చౌదురి ఓ ప్రకటనలో తెలిపారు. బ్రిజ్‌ భూషన్‌ లైంగిక వేదింపులను నిరసిస్తూ ఏప్రిల్‌ 23 నుంచి రెజ్లర్లు పోరాటం చేస్తున్నప్పటికీ ఎన్‌డిఎ ప్రభుత్వం స్పందించ కపోవడం అన్యాయమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే తప్పా పోలీసులు కనీస విచారణ చేపట్ట లేదని విమర్శించారు. మే 28న నూతన పార్లమెంట్‌ ముందర ధర్నాకు ప్రయత్నించిన రెజ్లర్లపై పోలీసులు దాష్టికంగా ప్రవర్తించారని అన్నారు. రెజ్లర్లకు మద్దతుగా జూన్‌ 1న సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) ఇచ్చిన దేశ వ్యాప్త ఆందోళనలకు బెఫీ కూడా మద్దతును ఇస్తుందన్నారు.