పడుకునే ముందు…

పడుకునే ముందు...శరీరానికి మంచి నీరు ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జీవక్రియలన్నీ సక్రమంగా పనిచేయాలంటే కచ్చితంగా తగినంత నీరు తీసుకోవాలని చెబుతుంటారు. వైద్యుల సూచన ప్రకారం ప్రతీ రోజూ కనీసం 3 నుంచి 4 లీటర్ల నీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. శరీరంలో అన్నిభాగాలు సక్రమంగా పనిచేయాలన్నా, డీహైడ్రేషన్‌కు గురికాకుండా శరీరం నిత్యం హైడ్రేట్‌గా ఉండాలన్నా కచ్చితంగా నీటిని తీసుకోవాలని చెబుతుంటారు. అయితే గోరువెచ్చని నీరు తాగడం వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతుంటారు. ప్రతీ రోజూ రాత్రి ఒక గ్లాసు గోరు వెచ్చిన నీరు తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. ఒక వారం రోజులు గోరు వెచ్చని నీరు తాగితే చాలు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. ఇంతకీ గోరు వెచ్చని నీరు తాగడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం..
గోరువెచ్చని నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం డిటాక్స్‌ను పొందుతుంది. బరువు తగ్గడమే కాకుండా శరీరంలోని వ్యర్థ పదార్థాలన్నీ తొలగిపోతాయి. రాత్రి భోజనం చేసిన అరగంట తర్వాత, నిద్రించడానికి ముందు గోరువెచ్చని నీటిని తాగితే.. శరీర జీర్ణక్రియ మెరుగవుతుంది.
గోరవెచ్చని నీటిని తీసుకోవడం వల్ల రోజంతా శరీరం చురుకుగా ఉంటుంది. అలాగే గోరువెచ్చని నీటిలో 2 చుక్కల నిమ్మరసం కలిపితే శరీరానికి మరింత శక్తి అందుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మంచి నిద్ర సొంతమవుతుంది. ఒత్తిడి, డిప్రెషన్‌ తగ్గుముఖం పడతాయి. చర్మంపై ముడతలు దూరమవుతాయి. చర్మం బిగుతుగా మారుతుంది.