సూర్యోదయానికి ముందే..

Before sunriseనేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది రాత్రి లేటుగా నిద్రపోవడం, ఉదయం లేటుగానే నిద్రలేవడం జరుగుతుంది. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. సమయానికి తినడం, నిద్రపోవడం వంటి క్రమశిక్షణతో కూడిన జీవితానికి చాలామంది ఇప్పుడు దూరమవుతున్నారనడంలో ఆశ్చర్యం లేదు. సూర్యోదయానికి ముందు ఒక గంట నిద్ర లేవడం వల్ల ఆరోజు చేయాల్సిన పనులను త్వరగా చేసుకోవడంతోపాటు, ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి అవేంటో తెలుసుకుందామా..!
– సూర్యోదయానికి ఒక గంట ముందు నిద్రలేచి.. కళ్లు మూసుకుని, కాసేపు నిటారుగా కూర్చుంటే.. ప్రేగు కదలికలు జరిగి శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి అని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో వ్యర్థాలు తొలగిపోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది.
– బ్యాక్టీరియా కానీ, ఆల్కహాల్‌, అరుగుదల కోసం వేసుకునే మందులు, మతకణాలు కానీ ఇలా ఏవైనా.. శరీరం నుంచి తొలగిపోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది.
ప్రతిరోజూ ఉదయాన్నే ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెరస్థాయిలు అదుపులో ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.